తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు దగ్గర చిన్నపల్లెటూరుకు చెందిన రాంబాబు సంగీతం నేర్చుకోలేదు. సాహిత్యనేపథ్యం ఉన్న కుటుంబం కాదు. తన జీవితాన్నే తన పాటకు ముడిసరుకుగా మార్చుకొని కోట్లాది మందిని తన పాటతో మాట్లాడుతున్నాడు, సందేశం ఇస్తున్నాడు, కదిలిస్తున్నాడు, స్ఫూర్తిని నింపుతున్నాడు. నిలువెత్తు ఉగ్వేగభరితమైన పాటగాడు రాంబాబు మనసు విప్పి తనలోని ఆవేదనను, ఆలోచనలను పంచుకున్నదే ఈ ఇంటర్వ్యూ. అణగారిన వర్గాలకు పాటతో తానో ప్రతినిధిగా మారిన రాంబాబు మాటల్ని వినండి. - తులసి చందు
No comments:
Post a Comment