Saturday, September 30, 2023

MS స్వామినాథన్ రుణం తీర్చగలదా దేశం? || Thulasi Chandu


 MS స్వామినాథన్ ఈ దేశ ఆకలి తీర్చాల్సిందే అని పూనుకోకపోయి ఉంటే మన దేశ వ్యవసాయరంగ చరిత్ర మరోలా ఉండేదేమో. నీటి వసతి విస్తారమైన భూములు ఉన్న చాలా ప్రపంచ దేశాలు ఆకలితో డొక్కలెండిపోయి ఉన్నాయి. 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశం విదేశాలకు బియ్యం, గోదుమలు ఎగుమతి చేసే స్థాయిలో ఉంది. 80 కోట్ల మంది ఆహార భద్రతను చట్టబద్ధం చేసింది. ఇదంతా రాజకీయ నాయకులు మేజిక్ చేస్తే సాధ్యమవలేదు. మహా శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ బృందం పూనుకుంటే సాధ్యమైంది. దేశం ఆకలి తీర్చాలన్న లక్ష్యం నెరవేర్చి.. 98 ఏళ్ల సంపూర్ణ జీవితం గడిపి.. భవిష్యత్తంతా.. ఎక్కువ తుపాకులున్న దేశాలది కాదు, ఎక్కువ తిండిగింజలున్న దేశాలదే అనే సందేశం ఇచ్చి వెళ్లిన MS స్వామినాథన్ గురించి పిల్లలకు చెప్పాలి. యువతకు శాస్త్రవేత్తలే హీరోలవ్వాలి అని కోరుకుంటూ ఈ వీడియో మీ ముందుకు తెచ్చాను. చూడండి.. ఎక్కువ మందికి షేర్ చెయ్యండి. #msswaminathan #greenrevolution

No comments:

Post a Comment