సాకే భారతిపై ఈనాడులో మొదట వార్త వచ్చిన వెంటనే నెంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడాను. అనంతపురం జిల్లాలోని మహిళా సంఘాల కార్యకర్తలతో వీడియో రికార్డు చేయించాను. మధ్యలో మణిపూర్ అంశం వల్ల ఈ వీడియో అప్ లోడ్ చెయ్యడం ఆలస్యమైంది. ఇప్పుడు కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. అందుకే వాటిపై మాట్లాడలేకపోయాను. అయితే.. ఓ వెనుకబడ్డ తరగతుల మహిళ(యానాది కులం) PhD సాధించాలి అంటే ఎన్నికష్టాలు పడుతుందో ప్రపంచం తెలుసుకోవాలి. ఎవరైనా మంచి డాక్యుమెంటరీ చేస్తే బాగుంటుంది అనిపించింది భారతితో మాట్లాడాక. ఆమె జర్నీ అత్యంత అరుదైనది. ఈ వీడియో చూస్తున్న వాళ్లలో ఫిలిం మేకర్స్ , డాక్యుమెంటరీ మేకర్స్ ఉంటే ప్రయత్నించగలరు.
No comments:
Post a Comment