ఇంటికో కథ Part-2 || Thulasi Chandu Special Documentary on Floods
జులై 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో కుండపోతగా వర్షాలు కురిశాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 62 సెంటీ మీటర్ల కుండపోత వర్షానికి చెరువులు తెగి, వాగులు పొంగి ఊర్లు మునిగాయి. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా మోరంచెపల్లె, ములుగు జిల్లా కొండాయి గ్రామాలు వరద తీవ్రతకు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయ్. మొత్తం గ్రామాల్లోని పశువుల్లో 90శాతం చనిపోయాయి. మనుషులు కొట్టుకుపోయారు. కొందరి శవాలు ఇప్పటికీ దొరకలేదు. చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. పచ్చని పంటలు, పశు సంపదతో తులతూగే మోరంచపల్లె బొందలగడ్డలా మారింది. కొండాయి గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. వరద తీవ్రత ఆ పల్లెల కష్టాలు చూశాక హైదరాబాద్ నుంచి 300 కిలో మీటర్లు ప్రయాణించి వాగులు వంకలు దాటుకుంటూ కష్టం మీద మోరంచపల్లె, కొండాయి చేరుకొని.. వాళ్ల ఆవేదనను, ఆ రోజు ఏంజరిగిందో వాళ్ల మాటల్లోనే రికార్డు చేశాం. ఇప్పుడు ఆ రెండు పల్లెల గురించి ఒక డాక్యుమెంటరీ రూపంలో మీ ముందుకు తెచ్చాం. ఇది పార్ట్-1 ఇందులో మోరంచెపల్లె గురించి ఉంటుంది. పార్ట్-2లో కొండాయి గురించి ఉంటుంది. ఈ డాక్యుమెంటరీ కోసం నా ఛానెల్ ఫాలో అయ్యే Subscribers స్పాన్సర్ చేశారు. వాళ్ల సపోర్టుతోనే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో మీ ముందుకు తేవడం సాధ్యమైంది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మా కృతజ్ఞతలు.
- టీం తులసి చందు
No comments:
Post a Comment